చిత్తూరు జిల్లాలో 58 నాటు తుపాకుల స్వాధీనం

చిత్తూరు: జిల్లాలో అక్రమంగా కలిగి ఉన్న  58 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్‌పీ క్రాంతిరాణ ఆదేశాలతో పలమనేరు డివిజన్‌లో పోలీసులు సొదాలు జరుపుతున్నారు. ఎవరైన అక్రమంగా ఆయుధాలు కలిగిఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌పీ హెచ్చరించారు.