చీరాల ఎమ్మెల్యేపై లోకాయుక్తలో ఫిర్యాదు

ప్రకాశం: ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు నమోదయ్యింది. ప్రభుత్వం భూములను కష్ణమోహన్‌ కబ్జా  చేశారంటూ మోహన్‌రావు అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు మేరకు అమంచిపై వేటపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో ఒంగోలు డీఆర్‌ఓ విచారణ చేపట్టారు.