చైనాలో రోడ్డు ప్రమాదం…36 మంది మృతి

బీజింగ్‌: ఉత్తర చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాంజీ ప్రాంతంలోని యానస్‌ పట్టణానికి సమీపంలో ఓ డబుల్‌డెక్కర్‌ బస్సు ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను అదుపుతప్పి ఢికొంది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ట్యాంకర్‌లో మిథనాల్‌ ఉండటంతో ప్రమాదం జరిగినవెంటనే భారీగా మంటలు చెలరేగి రెండు వాహనాలకు వ్యాపించాయి. ఘటనా స్థలనికి చేరుకున్న అధికారు సిబ్బంది సహాయక  చర్యలు చేపట్టారు.