జంటనగరాల్లో తెదేపా సమరభేరి: తలసాని
హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై తలసాని శ్రీనివాస యాదవ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సమరభేరి నిర్వహించనుంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం నగరంలోని నిజాం కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, జంటనగరాల ప్రజలకు దిశానిర్దేశం చేయడమే సమరభేరి ముఖ్య ఉద్దేశమని తలసాని తెలిపారు. తెదేపా హయాంలో జంటనగరాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే. కిరణ్ సర్కార్ అసమర్థతను ఈ వేదిక ద్వారా ఎండగడతామని ఆయన తెలియజేశారు.



