జంతర్‌మంతర్‌ వద్ద ఓయూ విద్యార్థుల ధర్నా ఉద్రిక్తం

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద ఓయూ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. అఖిల పక్షం పేరుతో జాప్యం చేయకుండా డిసెంబరు 9 నాటి ప్రకటనను వెంటనే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సోనియాగాంధీ నివాసం వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.