జంతర్‌మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శనలు

న్యూఢిల్లీ : అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన 23 ఏళ్ల వైద్య విద్యార్థినికి సంతాపంగా నిరిసన ప్రదర్శనలు చేపట్టేందుకు  పెద్దసంఖ్యలో యువత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ కూడలి వద్దకు చేరుకుంది. అత్యాచార ఘటనల్లో చట్టాలను కఠినతరం చేయాలని వారు ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు. దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాలంటూ నినాదాలు చేస్తూ ఇండియా గేట్‌ ప్రాంతానికి వెళ్లేందుకు  యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఏబీవీపీ కార్యకర్తలు జంతర్‌మంతర్‌ వద్ద ఉదయం నుంచి నిరసన కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 1.30కు మహిళా సంఘాలు ఇక్కడ శాంతి ర్యాలీ నిర్వహించనున్నాయి.