జగన్‌ను కలిసిన పార్టీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: వైకాపానుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు  ఈరోజు చంచల్‌గూడ్‌ జైలులో జగన్‌ను కలిశారు. గంటన్నరపాటు ఆయనతో మాట్లాడారు. రామకృష్ణారెడ్డి, గురునాధ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సుచరిత, అమర్‌నాధ్‌రెడ్డి,   రామచంద్రారెడ్డి తదితరులు ఆయనను కలిశారు. ఇటీవలే పార్టీలో చేరిన మైసూరారెడ్డి, సుజయకృష్ణ రంగారావు కూడా వారితో ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ప్రజలు భావించినందునే వైకాపాకు ఘన విజయం చేకూర్చారని  తెలిపారు.