జగన్‌ను గాంధీతో పోలికా:

హైదరాబాద్‌: మహాత్మగాంధీతో జగన్‌ను పోలుస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కాంగ్రెస్‌ ఎంపీ వి.హనుమంతరావు మరోసరి ధ్వజమెత్తారు. జనగణమన తెలియని జగన్‌కు గాంధీతో పోలికా అని ప్రశ్నించారు. గాంధీతో జగన్‌ను పోల్చడం చూస్తుంటే వైకాపాలో ఎలాంటి నేతలు ఉన్నారో తెలుస్తుందని అన్నారు. ఎస్సీలు, ఎస్టీలు పేదల సోమ్మును దోచుకున్న జగన్‌ను మహాత్మగాంధీతో పోల్చి ఆ పార్టీ నేతలు ఘోర తప్పిదం చేశారని మండిపడ్డారు. ఈశాన్య రాష్రాల ప్రజలకు పూర్తి భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కలసి కోరినట్లు వీహెచ్‌ తెలిపారు.