‘జగన్‌ సంస్థల భాగస్వామి ల్యాంకో యాజమాన్యంపై చర్య లేదా..?’

– సీబీఐని ప్రశ్నించిన ‘పొన్నం’
గోదావరిఖని, జూన్‌ 18 (జనంసాక్షి) : వైఎస్‌.జగ న్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ల్యాం కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో సీబీ ఐ ఎందుకు వెనుకడుగు వేస్తున్నదో… అర్థం కావ డం లేదని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అ న్నారు. సోమవారం స్థానిక ఐఎన్‌టీయూసీ కార్యా లయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ల్యాంకో యజమాని లగడపాటి రాజగోపాల్‌ సోదరుడు కావడం వల్లనే… సీబీఐ ఎటువంటి చర్యలకు పాల్పడటం లేదని… అర్థమ వుతుందన్నారు. సదరు సంస్థ యజమానిని సీబీఐ ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ లేదని లగడపాటి పేర్కొ నడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. రానురాను తెలం గాణ ఆకాంక్ష బలపడుతున్నదే తప్ప… తగ్గడం లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నదని, తెలంగాణ ప్రజలు ఉద్యమిం చడానికి సిద్దపడుతున్నారన్నారు. సమయం కోసం ఎదురుచూస్తు న్నారన్నారు. కాకి లెక్కలతో లగడ పాటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని, ఇతడన్నం త మాత్రాన తెలంగాణ ఆ గిపోదన్నారు. ప్రగ ల్భాలు పలికే రాజగోపాల్‌ సీమాంధ్రలో కాంగ్రెస్‌ ఉనికిని ఎందుకు కాపా డటం లేదని పొన్నం ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరపరాజయం పొందటానికి ప్రధాన కారణం తెలంగాణను ఇవ్వకపోవడమేనన్నారు. ఇప్పటికైనా అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే విషయం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని… లేకపోయినట్లయితే 2014లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నామ రూపం లేకుండా పోయే ప్రమాద ముందన్నారు. అలాగే తెలంగాణ ప్రజాప్రతి నిధులు ఐక్యతతో తెలంగాణవాదానికి ప్రాణం పోయాల్సిన సమ యం ఆసన్నమవుతున్నదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు తానిపర్తి గోపాల్‌రావు, కోట రవి, కాల్వ లింగ స్వామి, పి.మల్లిఖార్జున్‌, ఎస్‌.నర్సింహారెడ్డి, రాచ కొండ కోటేశ్వర్లు, మండ రమేష్‌, బాలసాని స్వామిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.