జగ్గంపేటలో సీసీ రోడ్స్ పనులు ప్రారంభం
చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- మండల పరిధిలోని జగ్గంపేట గ్రామంలో MGNREGS నిధులు 19 లక్షలు రూపాయలతో గ్రామంలోని అంతర్గత సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ పట్లోళ్ల మాంతప్ప మండల బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల అశోక్ రెడ్డి గార్లు మాట్లాడుతూ మన నర్సాపూర్ శాసనసభ్యులు గౌరవ శ్రీ చిలుముల మదన్ రెడ్డి మన జగ్గంపేట గ్రామానికి అధిక నిధులు మంజూరు చేయడంతో ఇప్పటి వరకు గ్రామంలో సీసీ రోడ్స్ మరియు మురికికాల్వలు పూర్తి చేయడం జరిగింది గ్రామంలో ఇంక మిగిలిన అంతర్గత రోడ్డులను ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తాం అని చెప్పారు మన గ్రామానికి 19 లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల గౌరవ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ యస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సికింద్రాపురం పోచయ్య. ఉప సర్పంచ్ పి శ్రీనివాస్ రెడ్డి వార్డ్ మెంబర్స్ అందోల్ పోచమ్మ. రవి. ఎల్లయ్య. యాదగౌడ్. బిక్షపతి. గ్రామప్రజలు పాల్గొన్నారు.