‘ జగ్గారెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నడు’ : నాయిని నర్సింహరెడ్డి

హైదరాబాద్‌: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నాయిని నర్సింహరెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరంలేదని, అలా అని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని  కలిసి లేఖ ఇస్తానని జగ్గారెడ్డి అనడంపై నాయిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జగ్గారెడ్డి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి తెలంగాణకే ద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు. ఆయనకు తెలంగాణ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.