జయశంకర్‌ చైతన్యం – తెలంగాణ పోరాటం

చాలా ఉపయోగపడేది. చాలా మందికి లేని ఒక విశ్వసనీయత జయశంకర్‌పై ఉండడానికి  ఆయ న తన జీవిత కాలానికి తెలంగాణ అనే  ఒక ల క్ష్యాన్ని ఎంచుకున్నాడు. దాని పట్ల రాజీలేదు. అను మానం లేదు. శషభిషలు లేవు. ఇది చాలా మంది కి సాధ్యంకాదు. ఆలోచనలు, విశ్వాసాలు బాహ్య ప్రపంచంలో జరిగే ఆటుపోట్లకు గురవుతుంటా యి. మనుషులు, వారి ఆలోచనలు నిరంతరంగా మారుతుంటాయి. నిజానికి వరంగల్‌లో పుట్టి, పె రిగి, ఆ రాజకీయ వాతారణంటో జీవిస్తూ ‘ తెలంగాణ’ గురించే ఆలోచించడం ఆ విశ్వాసాన్ని వదు లుకోకపోవడం పరిమితా లేక బలమా అన్న అం శాన్ని అంచనా వేయడం కష్టమే. ఒకవేళ అది బ లహీనతే అని అనుకున్నా తెలంగాణ చరిత్ర భిన్న మలుపులు తిరిగి మళ్లీ ప్రత్యేక తెలంగాణ డిమాం డ్‌కు చేరుకోవడం వల్ల జయశంకర్‌ బలహీనత కూడా బలమైన శక్తిగా మారడం వ్యక్తి జీవితంలో జరిగే చాలా అరుదైన సంఘటనలలో ఒకటి.జయశంకర్‌ వరంగల్‌లో పుట్టి, అక్కడ చదు వుతున్న కాలంలో, ఆ ప్రాంతం తెలంగాణ సాయు ధ పోరాటంలో ఉంది. వరంగల్‌లోని మధ్యతరగ తి దానిచేత ప్రభావితమైనవాళ్ళే, అయితే తెలంగా ణ సాయుధ పోరాట విరమణతో తెలంగాణ అస్తి త్వ చైతన్యం రూపొందించడం జరిగింది. సాయు ధ పోరాటానికి అగ్రభాగాన ఉన్న నాయకత్వం సై ద్ధాంతిక కారణాల వల్ల విశాలాంవూధను బలపరి చారు. అప్పటి కమ్యూనిస్టు పార్టీ సమాజం సమ గ్రంగా మారుతుందని విశ్వసించింది. ఆ సమస మాజ స్థాపనే అప్పటి వాళ్ల స్వప్నం. ఈ సమ స మాజ నిర్మాణంలో భాగంగా ప్రాంతీయ అసమాన తలు, కులపరఅణచివేత, మహిళలపై హింస రద్దె మనుషులంతా మనుషులుగా మలచబడే ఒక గుణాత్మకమైన మార్పు వస్తుందనేది ఆ ప్రాపంచిక దృక్పథ నమ్మకం. విశాలాంవూధలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తుందని, మౌళిక మార్పులు తీసుకరాగలమనే విశ్వాసం వాళ్లకుండవచ్చు. ఎం దుకో తెలంగాణ ప్రాంతంలో అప్పటికే ఆ విశ్వా సంపై అనుమానాలున్నాయి. దానికి తోడుగా కాం గ్రెస్‌ పార్టీ బలం పుంచుకొని రెండవ పార్వవూతిక ఎన్నికలలో సోషలిస్టు నినాధాలలను, భావజాలా న్ని నెతత్తికెత్తుకొని కమ్యూనిస్టు పార్టీని వెనక్కి నెట్ట గలిగింది. కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల రాజకీయాల లోకి వచ్చినా, సమాంతరంగా  ప్రజా ఉద్యమాల ను, పోరాటాలను సజీవంగా కొనసాగించి ఉంటే, ఎన్నికలలో ఓడిపోయినా ఉద్యమాలు కొనసాగేవి. అలా చేయకపోవడంతో తమ కలలు కన్న ‘విశా లాంధ్రలో ప్రజారాజ్యం’ స్వపం చెదిరిపోయింది. తెలంగాణ అస్తిత్వం విశాలాంధ్ర భావనకు భిన్నం గా బలం పుంజుకుంటున్న సందర్భం జయశంకర్‌ చైతన్యాన్ని  ప్రభావితం చేసిందేమో అనిపిస్తుంది.రాష్ట్రంలో 1960వ దశాబ్దంలో ప్రవేశపెట్టబ డిన హరిత విప్లవం అన్ని రకాల అసమానతలను ముఖ్యంగా ప్రాంతీయ అసమానతలను పెంచింది. దీనికితోడు తెలంగాణలో సాయుధ పోరాటం అప రిష్కారంగా మిగిలించిన భూస్వామ్య సంస్కరణలు కొనసాగడమే కాక, ఏ భూస్వాములకు వ్యతిరేకం గా పోరాటాలు జరిగాయో వాళ్లే భిన్న అవతారాల లో రాజకీయ అధికారం చేజిక్కించుకోవడం వల్ల. ఒకవైపు జగిత్యాల జెతయాత మరోవైపు ప్రత్యేక తె లంగాణ రాష్ట్ర పోరాటం దాదాపు కలిసే జరిగా యి. నక్సలైట్‌ ఉద్యమ ప్రభావం కన్నా ‘ తెలంగా ణ అస్తిత్వ ఉద్యమ చైతన్యం’ కలిగిన జయశంకర్‌ ను ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే ఎక్కువ ప్రభావి తం చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులు రాజకీయ నాయకులు ద్రోహాలతో వి సిగి అడవికి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. అయితే శ్రీకృష్ణ కమిటీ రహస్య చాప్టర్‌లో తెలం గాణ ఇస్తే నక్సలైట్లు బలం పుంజుకుంటారు అనే ది ఎంత నిజమో తెలియదు కాని,1960ల అనుభ వాన్ని చూస్తే. ఇవ్వకపోతే ఆ పోరాటాలవైపే నెట్టు తాయి. ఈ  మాటా జయశంకర్‌ తన సుదీర్ఘ అను భవం వల్ల, ఒక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని అంగీకరించకపోతే ఇంకొక పోరాట ప్రత్యామ్నా యం ముందుకు వస్తుందని, 1956 అనుభవం వ ల్ల, 1969 అనుభవ ఆధారంగా మళ్లీ అనేవాడు.వరంగల్‌లో రాడికల్‌ చైతన్యం ఉవ్వెత్తున లేచి న సందర్భంలో జయశంకర్‌ వరంగల్‌ సీకేఎం కా లేజీకి ప్రిన్సిపాల్‌గా వచ్చాడు. అయితే జయశంక ర్‌లో ఒక లక్ష్యానికి పనిచేసే చిత్తశుద్ధి, ఇచ్చిన పని ని సమర్థవంతంగా నిర్వహించే ప్రతిభ, వ్యక్తిగత ని జాయితీ వరంగల్‌లోని కొందరు రాజకీయ నాయ కులకుకంటకంగా తయారయ్యాయి. జయ శంకర్‌ చాలా సౌమ్యుడు. భాషలో అతి జాగ్రత్తలు పాటించేవాడు. సంస్కారం ఉన్నవాడు. ఇవన్ని దిగ జారిన రాజకీయ నాయకులను భయపెట్టాయి. వాళ్లు ఆ యన రాకను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అది వాళ్లు సాధించలేకపోయారు. రాజకీ య నాయకులను భయపడడం కాని, వాళ్ల అడు గులకు మడుగులు ఒత్తడం కాని జయశంకర్‌ వ్య క్తిత్వంలోనే లేవు. ఆయన చాలా ఆత్మగౌరవం ఉ న్న మనిషి. తనను తాను గౌరవించుకోలేని ఏ వ్యక్తి కూడా ఇతరుల గౌరవాన్ని పొందలేడు, ఆ యన ముఖ్యమంత్రులతో మాట్లాడినా, ప్రధాన మంత్రులతో మాట్లాడినా, సోనియాగాంధీతో మా ట్లాడినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేలాగా మాట్లాడాడు. బహుశా బలమైన వ్యక్తిగత విశ్వాసా లుండే వ్యక్తులకే అది సాధ్యమవుతుందేమో!సీకేఎం కాలేజీ రాజకీయంగా రెండు బలమై న శిబిరాలు కలిగిన అధ్యాపకులు, విద్యార్థులున్న సంస్థ. ఇవి రెండు ధృవాలుగా ఉండేవి. వామపక్ష అధ్యాపకులు, వి.వి, వి.యస్‌. ప్రసాద్‌తో సహా ఆ యన నిజాయితీని, నిబద్ధతను గౌరవించారు. ఇం కొక శిబిరం ఆయన పాలనా పటిమను, పారదర్శ కతను తట్టుకోలేకపోయింది. ఈ రెండు శిబిరాల సహకారాన్ని ఆయన తెలంగాణ వాది కావడం వలన, రాజకీయ సైద్ధాంతిక ఘర్షణను కొంత వర కు బయట ఉంచగలిగాడు. బహుశా ఆ అనుభ వం వల్లే తెలంగాణ ఉద్యమంలో ఎవరూ కలిసొ చ్చినా ఆర్‌. ఎస్‌.యు నుంచి ఆర్‌.ఎస్‌. ఎస్‌ దాకా అని అంటూ ఉండేవాడు, నిజానికి తెలంగాణ చరి త్ర తిరిగిన మలుపులలో ఆ ఉద్యమానికి ఇటు బీజేపీ అటు మవోయిస్టు పార్టీలు మద్దతివ్వడం ఒ క చారిత్రక  విచిత్రమే. కాని జయశంకర్‌కు ఈ చారిత్రక సందర్భం చాలా వెసులుబాటు కల్పిం చింది. అందుకే ఆయన మరణానికి అన్ని వర్గాల నుంచి ఒక అనూహ్యమైన స్పందన వచ్చింది.ఇందిరాగాంధీ రాజకీయాలతో ప్రారంభమైన అస్తిత్వ ఆధారిత రాజకీయాలు, 1980 వ దశా బ్దం వరకు చాలా బలమైన రాజకీయ శక్తిగా ఎదు గుతూ వచ్చాయి. వర్గ రాజకీయాలతో పాటు స మాంతరంగా అస్తిత్వ రాజకీయాలు బలం పుంజు కుంటున్న సందర్భంలో 1990వ దశకంలో ప్రత్యే క తెలంగాణ అస్తిత్వ ఉద్యమం మరోసారి ముందు కు వచ్చింది. ఈ ఉద్యమం ముందుకు వస్తున్న త రుణంలో అప్పటికే పాలనా అనుభవం, ప్రజాదర ణ పొందిన జయశంకర్‌ ఉన్నత శిఖరాలకు ఎది గాడు. 1950 ‘ముల్కీగోబ్యాక్‌’ ఉద్యమం అప్పుడు ఆయన విద్యార్థి, 1960 ఉద్యమకాలంలో అధ్యాప కుడు. 1990 ఉద్యమం వరకు ఒక నిర్ణాయకశక్తి గానే కాక సిద్ధాంతకర్త అని భావించే దశకు చేరు కున్నాడు. చరిత్ర కొన్ని రహస్యాలను కొన్ని ఆశ్చ ర్యాలను తన గర్భంలో దాచుకొని ఉంటుంది. అ లా దాచుకున్న ఆశ్చర్యాలలో జయశంకర్‌ జీవితం, దాని ప్రయోగికత ఒకటి.జయశంకర్‌ వ్యక్తిత్వంలో మరొక ఆశ్చర్యాన్ని కలిగించే అంశం అధ్యాపకుడికి, రాజకీయ సామా జిక ఉద్యమాలకుండే సంబంధం. 1970లలో వరంగల్‌ ఉపాధ్యాయ, అధ్యాపక వర్గం పోరాట రాజకీయాలతో మిళితమైన సందర్భం. ప్రజా ఉద్య మాలు అధ్యాయాలు అధ్యాపక వర్గాన్ని ప్రభావితం చేస్తూ, అధ్యాపక వరగం ఉద్యమాలను ప్రభావితం చేసిన సందర్భమిది. నాలాంటి వాళ్లం ఆ సంద ర్భం వల్ల ప్రభావితమైన వాళ్లమే. కానీ రాను విశ్వ విద్యాలయ అధ్యాపకులు చాలా కారణాల వల్ల ఉద్యమ రాజకీయాలకు దూరం అవుతూ వచ్చారు. ఏదో మన చదువు మనం చెబితే సరిపోతుంది దగ్గర ప్రారంభమై, తమ వ్యక్తిగత కుటుంబ సమస్య లతో కూరుకుపోతున్న సందర్భంలో కుటుంబమే లేని జయశంకర్‌కు తెలంగాణనే ఆయన కుటుంబం. ఆయన ఒక విశ్వవిద్యాలయానికి వీసీగా ఉన్నప్పుడు కూడా నా కు తెలిసి తెలంగాణపై సమాచారం సేకరిస్తూనే ఉన్నాడు. ఏ హూదాలో ఉన్నా తెలంగాణ అంశం మాత్రం ఆయనను, దాన్ని ఆయన వదలలేదు.అధ్యాపకులంతా ఒక నిరాశావాదంలో ఉండే దశలో ఆయన తెలంగాణ ఉద్యమం అనివార్యం గా వస్తుందనే విశ్వసించాడు. దాని కోసం తనను సమాయత్తపరుచుకున్నాడు. అధ్యాపకుల పాత్ర ఉంటుందని, ఉండాలని ఆయన విశ్వసించాడు. అధ్యాపకులు క్లాస్‌రూంకు పరిమితం కాకుండా వి శాల సామాజిక తరగతి గదిలో ఒకవైపు విద్యా ర్థుల్లాగ ప్రజల నుంచి నేర్చుకుంటూ, ప్రజలకు త మ విజ్ఞానాన్ని అందించాలని బలంగా భావించా డు. అలా భావించినందువల్లే తెలంగాణ అంతా తిరిగాడు. వేల ఉపన్యాసాలు ఇచ్చాడు. జయశంక ర్‌ ఇచ్చిన వారసత్వం ఉపాధ్యాయ, అధ్యాపక వ ర్గానికి సదా ఒక స్ఫూర్తిని కలిగించేదే.ఈ జయశంకర్‌ స్మారకోపన్యాసం ముగిసిన తర్వాత ప్రఖ్యాత ఆర్ధిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సీహె చ్‌.హనుమంతరావు అధ్యక్ష పలుకులతో జయశం కర్‌ మీద తెలంగాణ సాయుధ పోరాట ప్రభావం ఎందుకు పడలేదనే ఒక సందేహం తనకు ఉండేద ని, బహుశా తెలంగాణ అస్తిత్వ సమస్య ఆయన చైతన్యంతో అత్యంత ప్రభావితంగా ఉండబట్టే ఇ లా జరిగుండవచ్చంటూ, తాను విద్యార్థిగా ఉన్న ప్పుడు ఉద్యమంలోకి ఎలా వెళ్లాడో వివరించారు.అయితే నాడు తెలంగాణ పోరాటంలో భాగ మై తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ ఎక నామిక్స్‌ శాఖలో పనిచేసి, ప్లానింగ్‌ కమిషన్‌, ఫై నాన్స్‌ కమిషన్‌, లేబర్‌ కమిషన్‌ లాంటి అత్యున్న తమైన విధాన నిర్ణయ సంస్థలలో పనిచేసి అందరి మెప్పులను పొందిన హనుమంతరావు తెలంగాణ అస్తిత్వానికి మద్దతు ఇవ్వడమే కాక, జయశంకర్‌ మరణం తర్వాత ఆయన రాసిన నివాళి వ్యాసం వి జంగా చాలా గొప్ప నివాళే. రెండు మార్గాల ద్వా రా రాజకీయ ప్రస్ధానం ప్రారంభించి తెలంగాణ ల క్ష్యం పట్ల ఏకీభావం కలిగి ఉండడం జయశంకర్‌ విశ్వాసానికి  గౌరవమే కాక, తెలంగాణ ప్రజానీకా నికి ఒక గొప్ప అనుభవమే