”జయశంకర్‌ సారుకు జోహార్‌”

తెలంగాణ ఉద్యమానికి పెద్దదిక్కు ప్రో.జయశంకర్‌ సారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు. తెలంగాణ కావాలని మా తెలంగాణ బిడ్డలు బాగుపడాలని వలసవాద పెత్తనపు చెరసాలనుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలని అనునిత్యం ఆరాటపడుతూ తెలంగాణ తెలంగాణ సాధించాలనే తపనతో ఉద్యమానికి అడుగు అడుగున కొండంత అండగ నిలిచి  పోరుచేయడానికి పోరుబాట జూపి తెలంగాణ ప్రజలకు వెన్నంటి నిలిచి ఉద్యమాన్ని ఉవ్వేత్తున ఎగిసిపడటానికి మూల కారణమై తెలంగాణ ఉద్యమానికి మూల స్థంబంగా నిలిచాడు. వలసవాద పాలనను అంతం చేయడానికి దశాబ్దాలుగ కొట్లాడిండు కాని   తెలంగాణ సాధించాలనే ఆయన ఆశ నెరవేరకముందే మనల్నీ వదిలేసి అందని లోకాలకు వెళ్ళాడు నింగిలోని తారగా నిలిచాడు కోట్లాది తెలంగాణ ప్రజల గుండెల్లో తరతరాలకు చెదరని ముద్ర వేసుకున్నాడు. ఆయన స్ఫూర్థితో మనం అడుగు ముందకెేయాలీ

ఆయన ఆశను, ఆశయాలను మనందరం స్ఫూర్థిగా తీసుకుని పోరాట పటిమతో ప్రతి తెలంగాణ బిడ్డ ఉద్యమించాలి. ఆత్మహత్యలు వద్దు అంతియ విజయం మనదే కొట్లాడి గెలవాలి తెలంగాణ సాధించాలి.