జానారెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైద్రాబాద్‌: తెలంగాణ అంశంపై చర్చించేందుకుగానూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు శనివారం జానారెడ్డి నివాసంలో భేటీఅయ్యారు. తెలంగాణకు కట్టుబడి ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని ఫ్రంట్‌గా ఏర్పాటు చేయాలనే యోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌ మనుగడ సాధించలేదని, ఈ విషయమై హైకమాండ్‌కు తీవ్ర ఒత్తిడి పెంచాలని ఎంపీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా మరోసారి భేటీ అయి సెషన్స్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎంపీలు ఖరారు చేసుకోనున్నారు.