జార్ఖండ్‌ సీఎం ముండా రాజీనామా

రాంచీ : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. బీజేపీ, జేఎంఎం నేతల మధ్య విబేధాలు తలెత్తడంతో జేఎంఎం నేతలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండా సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ సయీద్‌ అహ్మద్‌కు సమర్పించారు. మరోవైపు జేఎంఎం నేతలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్‌కు లేఖ అందజేశారు.