జిల్లా ప్రజలకు ఎస్పీ దుగ్గల్‌ దీపావళి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లా ప్రజలందరికీ ఈ నెల 13న దీపావళి పండుగ సందర్బంగా జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో , సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అహంకారం, స్వార్థం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి మంచి అనే దీపం వెలిగించి పది మందికి వెలుతురును ఇవ్వాలని ఉద్భోధించారు. పిల్లలు బాణా సంచాలు కాల్చేటప్పుడు కుటుంబ పెద్దలు దగ్గరుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అందరూ సహకరించాలన్నారు. ప్రజలు, పోలీస్‌ సిబ్బంది స్నేహ పూర్వకంగా, సోదరభావంతో మెలగాలని ఆయన సూచించారు.