జిల్లా మరియు రాష్ట్ర సరిహద్దుల్లో నాకా బందీ నిర్వహించిన జిల్లా పోలీసు అధికారులు

share on facebook
 వికారాబాద్ జిల్లాప్రతినిది జనంసాక్షి మార్చి06:
జిల్లాలో ఇసుక, ఎర్రమట్టి, పిడిఎస్ బియ్యం, గుట్కాలు, గంజాయి మొదలగునవి అక్రమ రవాణా ను  అరికట్టుటకు కంకనబద్దులు అయిన జిల్లా ఎస్పి  n. కోటీ రెడ్డి,ఐ. పి. ఎస్  ఆదేశాలమేరకు  రాత్రి వికారాబాద్ జిల్లా తో సరిహద్దులు కల్గినటువంటి ఇతర జిల్లాల మరియు రాష్ట్ర ల పొలినేర లలో జిల్లా పోలీస్ అధికారులు నకబందీ ఏర్పాటు చేయడం జరిగినది. మొత్తం జిల్లాలో 10 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తే అందులో మోమినపేట,నవాబ్ పేట్ , పరిగి, చెన్ గోముల్, పెద్దేముల్ మరియు యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలలోని  ఇతర జిల్లాతో అనుసందనం కల్గిన రోడ్డు ప్రాంతాలలో నిర్వహిస్తే మిగిలిన నాలుగు బంట్వారం,కోడంగల్,కరణ్ కోట్, మరియు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఇతర రాష్ట్రాలతో అనుసందనం కల్గినటువంటి రోడ్డు ప్రాంతాలలో నిర్వహిచడం జరిగినది.  నకబందీ కార్యక్రమం జిల్లా లో రాత్రి సమయం లో మొదలయి ఉదయం సమయం వరకు కొనసాగడం జరిగినది. ఇట్టి కార్యక్రమం లో మొత్తం 626 (ద్వి చక్ర 164, త్రీ చక్ర 45 మరియు 4 విలర్స్ 271, హెవి వాహనాలు 146) వాహనాలను పోలీస్ అధికారులు చెక్ చేసి 04 వాహనాలను సీజ్ చేయడం జరిగినది అందులో దీచక్ర వాహనాలు 02 మరియు 02 లారీలు ఉన్నాయి.
రాత్రి సమయాలలో పోలీస్ అధికారులు నకబందీ చేసే సమయంలో జిల్లా ప్రజలందరూ కూడా తమ వాహనాల పత్రాలను మరియు గుర్తింపు కార్డ్ లను వెంటపెట్టుకొని పోలీస్ అధికారులకు సహకరించాలని, ఈ నకబందీ కార్యక్రమం అక్రమ రవాణాకు అరికట్టుటకు, మత్తుపదార్థాలు ఇతర ప్రాంతాలనుండి మన జిల్లా లోకి రాకుండా మరియు జిల్లా లోని బయటి ప్రాంతాలలో గాని రోడ్డు చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో దొంగతనాలు జరగకుండా నివారించడానికి  ప్రజల శ్రేయస్సు కొరకే అనే విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని జిల్లా ఎస్పి శ్రీ n. కోటి రెడ్డి ips  తెలిపినారు.
ఇట్టి కార్యక్రమం లో ఆయా పోలీస్ స్టేషన్ 19 మంది అధికారులు, 50 మంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగినది.

Other News

Comments are closed.