జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి తాళం వేసి నిరసన
హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి తెదేపా కార్పొరేటర్లు తాళం వేశారు. నగరంలో నెలకొన్న సమస్యలపై మేయర్, కమిషనర్ వచ్చి హామి ఇచ్చేంతవరకూ తాళం తీయబోమని ధర్నాకు దిగారు. తెదేపా నేత సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



