జూట్ మిల్ వద్ద కొనసాగుతున్న కార్మికుల ఆందోళన

గుంటూరు:జూట్ మిల్ కొనుగోలు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలన్న డిమాండ్ తో కార్మికులు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన అధికార పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… లాభాల్లో నడుస్తున్న జూట్ మిల్ ను మూసివేయించేందుకు ఇద్దరు వైసీపీ నేతలు తోట సత్యనారయణ, అంబటి మురళిలు చట్ట విరుద్ధంగా కుట్ర పన్ని జూల్ మిల్ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. వీరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. జూట్ మిల్ ను ఎట్టి పరిస్థితుల్లో మూతపడనివ్వమని మోదుగుల స్పష్టం చేశారు