జూలపల్లి సర్పంచ్‌కు ఆత్మీయ సన్మానం

జనంసాక్షి, కమాన్ పూర్ : జాతీయ స్థాయిలో పంచాయతీ అవార్డుల్లో భాగంగా మండల స్థాయిలో 9 విభాగాల గాను 9 అవార్డులు, జిల్లా స్థాయిలో రెండు విభాగాల్లో అవార్డులు పొందిన జూలపల్లి సర్పంచ్‌ గొల్లపల్లి శంకర్ గౌడ్ కు, పంచాయతీ కార్యదర్శి వెంకట రమణారెడ్డి లకు సోమవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆత్మీయ సన్మానం చేశారు. శాలువాలు కప్పి సన్మానించి, స్వీట్లు తినిపించి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక కావడంలో సహాకారం అందించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధును సర్పంచ్‌తో పాటు జిపి సిబ్బంది ఘనంగా సన్మానించారు.