జేఈఈ మెయిన్‌కు గడువు పొడగింపు

దిల్లీ(జనంసాక్షి): దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌`2024 (ఏఇఇ ఎజీతిని 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఎన్‌టీఏ గడువు పొడిగించింది.జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షకు దరఖాస్తుల తుది గడువు నేటితో (నవంబర్‌ 30) ముగియడంతో.. ఆ గడువును డిసెంబర్‌ 4 రాత్రి 9గంటల వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అలాగే, అదే రోజు రాత్రి 11.50గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.దరఖాస్తుల్లో ఏవైనా సవరణలు చేయాల్సి వస్తే డిసెంబర్‌ 6 నుంచి 8వరకు అవకాశం కల్పించింది. పూర్తి అప్‌డేట్స్‌ కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని సూచించింది. ఏఇఇ ఓజీతిని సెషన్‌`1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య తేదీల్లో జరుగుతాయని ఇది వరకే ఔుం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 8.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చని అంచనా. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50 లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉంది.