జైపాల్‌రెడ్డితో టీ కాంగ్రెస్ ఎంపీలు భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హస్తినలో అందుబాటులో ఉన్న టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం తెలిసింది.