జై ఆంధ్ర ఉద్యమని కొనసాగిస్తామం: వసంత

విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామలో జైఆంధ్రా జేఏసీ తల పెట్టిన బహిరంగసభ ఉద్రిక్తతలకు దారితీసింది. బహిరంగసభ కోసం ర్యాలీగా బయలుదేరిన జేఏసీ గౌరవ అధ్యక్షుడు వసంత నాగేశ్వరరావును పోలీసులు జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. ర్యాలీలోని కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను బహిరంగసభకు  వెళ్లనివ్వాలంటూ వసంత నాగేశ్వరరావు పోలీసులతో వాగ్వాదానికి దిగి రహదారిపైనే బైఠాయించారు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించటంతో వసంత  నాగేశ్వరరావును అరెస్టు చేశారు. అదే సమయంలో సమైఖ్యాంధ్రా జేఏసీ కార్యకర్తలు కూగా అక్కగికి చేరుకుని సమైఖ్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని కూడా అడ్డుకుని అక్కడి నుంచి పంపించివేశారు.