జౌళి పార్కు పరిశీలన

హైదరాబాద్‌:రాజధానికి సమీపంలోని మల్కాపూర్‌లో చేనేత జౌళి పార్కులో పరిస్ధితుల పరిశీలనకు పరిశ్రమలశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ పార్కు అభివృద్ధికి నోచుకోవడం లేదని,నిర్లక్ష్యం వల్ల యూనిట్లు మూతపడుతున్నా అంటూ చిన్న  పరిశ్రమల సంఘాల సమాఖ్య (ఫ్యాప్సియా) గతనెలలో పరిశ్రమల కమిషనర్‌ ఫిర్యాదు చేసింది. దీనిపై పరిశ్రమల శాఖ స్పందించి ఈ కమిటీని నియమించింది. పరిశ్రమల అధికారులు,ఫ్యాప్సియా ఛైర్మన్‌ ఏపీకే రెడ్డిలతో ఈ కమిటీ ఏర్పాటైంది. పార్కును పరిశీలించిన ప్రతినిధులు త్వరలోనే దాని అభివృధ్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి పరిశ్రమల కమిషనర్‌కు నివేదిక అందిచనున్నారు.