టాటాఏసీ వాహనం బోల్తా : 18 మందికి గాయాలు

వర్చూరు : జిల్లాలోని వర్చూరు-కారంచేడు మధ్య ఈ రోజు ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్‌ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.