టార్గెట్ 4-1 రేపు శ్రీలంకతో టీమిండియా ఆఖరి వన్డే
పల్లె కెలే, ఆగస్టు : శ్రీలంక పర్యటన లో వన్డే సిరీస్ గెలుచుకున్న బారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఆఖరి వన్డేకు సిద్దమైంది. సిరీస్ విజయాన్ని పక్కన పెట్టి ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని భావిస్తొంది.4-1తోటూర్ ను ముగిస్తే .. వన్డే ర్యాకింగ్స్‌లో భారత్ రెండో స్థానానికి చేరుకుంటుంది. దీంతొ చివర మ్యాచ్‌నూ ధోని అండ్ కో తేలిగ్గా తీసుకొవడం లేదు. ప్రసుత్తం బ్యాటింగ్ పరంగా మనన జట్టు మంచి ఫామ్‌లో ఉంది. రెండో వన్డేలో మినహాయిస్తే .. మిగిలిన మూడు మ్యాచ్‌లలోనూ బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణించారు.ముఖ్యంగా వైస్ కెప్టెన్ విరాట్ కొహ్లీ సూపర్ ఫామ్‌లోనూ ఉన్నాడు.ఈ సిరిస్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన కోహ్లి మరొసారి చెలరేగాలనుకుంటున్నాడు.గత మ్యాచ్‌లో గంభీర్ విఫలమైనా ..సెహ్వగ్, సురేష్ రైనా రాణించారు. చివర్లో మనోజ్ తివారీ 21 పరుగులే చేసినా మంచి ఇన్నింగ్సే ఆడాడు .ఇక ధొని, ఇర్పాన్ పఠాన్ కూడా ఎటువంటి ఆందోళనా లేదు.అయితే సిరీస్ ప్రారంభం నుండీ మన పేస్ బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపొతుడడం కాస్త కలవరపెడుతోంది. కొలంబో వన్డేలో పార్ట్ టైమ్ బౌలర్లు రాణించకుంటే భారత్‌కు సిరీస్ విజయం దక్కేది కాదు. ముఖ్యంగా తుది జట్టులో రాహుల్‌శర్మను తప్పించి తివారీని తీసుకొవడం కలిసొచ్చింది.
పార్ట్ టైమ్ బౌలర్‌గా తివారీ ఆకట్టుకున్నాడు.4 వికెట్లు పడగొట్టాడు.అటు బౌలర్లను మార్చిమార్చి ప్రయెగించడం ద్వారా ధోని సక్సెస్‌కున్నాడు.4 వికెట్లు పడగొట్టాడు. అటు బౌలర్లును మార్చిమార్చి ప్రయోగించడం ద్వారా ధోని సక్సెస్‌య్యాడు. దీంతో మరోసారి వారే కీ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తోంది.అయితే వీరికి పేసర్ల నుండి సహకారమందితే లంకను కట్టడి చేయొచ్చు .మరొవైపు సొంత గడ్డపై సిరిస్ కొల్పొయిన శ్రీలంక చివరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. సరైనా స్కోర్ సాధించలేకపోతొంది. అటు బౌలర్లు కూడా గాడి తప్పారు.చివర మ్యాచ్ లోనైనా అన్ని విభాగాలలో గాడిన పడాలని లంక మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.ఇదిలా ఉంటే భారత తుది జట్టులో మార్పులు జరిగే
అవకాశాలున్నాయి.రిజర్వ్ ఆటగాళ్ళకు చోటు కల్పించాలని ధోని భావిసున్నాడు.ఈ నేపథ్యంలో గంభీర్ స్థానంలో రహానేకుే చోటు దక్కోచ్చు.