టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు. 

చిట్యాల 25(జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ కి చెందిన 15 మంది యువజన నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.శనివారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు తౌటం నవీన్  చిట్యాల టౌన్ యూత్ అధ్యక్షుడు మాసు రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి  సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి  కండువా కప్పి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై తెరాస లో చేరడం శుభసూచికం అన్నారు.యువతకు ఎల్లపుడు అండ దండ గా మేము ఎల్లపుడు ముందు ఉంటాం అని పేర్కొన్నారు.పార్టీలో  లద్దునూరి ప్రభు,జంగ శ్రీధర్,మొలుగురి కిషన్,మాసు ప్రశాంత్,పుల్ల శ్రీకాంత్, వాసాల శ్రీకాంత్,పుల్ల బన్నీ,పుల్ల శివ, పుల్ల సంజయ్, పుల్ల సతీష్,పుల్ల సాత్విక్ లు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అరెపల్లి మల్లయ్య,జెడ్పిటిసి గొర్రె సాగర్,ఎంపిపి దావు వినోద వీరారెడ్డి,స్థానిక ఎంపిటిసి కట్కూరి పద్మ నరేందర్,ఇంచార్జి సర్పంచ్ పూర్ణ చెందర్ రావు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా ,మండల నాయకులు చింతల రమేష్,మడికొండ రవీందర్ రావు,మెరుగు సంపత్ కుమార్, పెరుమాండ్ల రవి,స్వామి,టేకు రవి,కట్కూరి రాజేందర్,కట్కూరి కుమార్,అరెపల్లి తిరుపతి,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.