టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ గుప్తా మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే.

మర్పల్లి ఆగస్టు 26 (జనం సాక్షి) గురువారం రోజున టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా మాతృమూర్తి మరణించినారు. శుక్రవారం రోజున వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కో ఆప్షన్ మెం బర్ సోయల్ షరీఫ్, గఫర్ గౌస్ తదితరులు ఉన్నారు.