టిడిపి కార్యాలయం ప్రారంభం

విజయనగరం, జూలై 26 : టిడిపి కార్యాలయాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఆ పార్టీ నాయకులు కరణం శివరామకృష్ణ ప్రారంభించారు. అంతకు ముందు ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ పార్టీ మరింత బలపడాలన్న ఉద్దేశ్యంతో కార్యకర్తల అభీష్టం మేరకు నియోజకవర్గ కేంద్రంలో నూతన కార్యాలయం ప్రారంభించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా టిడిపి ఎదగబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం, దత్తిరాజేరు మండల పార్టీ అధ్యక్షులు జి.రవి, జి.త్రినాధ, మాజీ ఎంపిపి కంది తిరుపతి, ఎల్‌.బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.