రగులుతున్న పశ్చిమాసియా

అమెరికా యుద్ధనౌక‘అబ్రహం లింకన’పై దాడి..
` ప్రకటించిన ఇరాన్.. తోసిపుచ్చిన అమెరికా
` కూలిన అమెరికా ఈఫ్యూయలింగ్ విమానం
` ఇరాక్‌లో కూలినట్లు ప్రకటించిన అమెరికా
` తామే కూల్చామన్న ఇరాక్ రెబల్స్..
` టెహ్రాన్‌లో భారీ పేలుడు.. పలువురు మతి
` ఒమన్‌లో డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయులు మతి, 10 మందికి గాయాలు
టెహ్రాన్(జనంసాక్షి):అమెరికా విమాన వాహకనౌక అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ యుద్ధ విమానాన్ని ఢీకొట్టాయని వెల్లడించింది. దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొంది. అయితే అమెరికా ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఇరాన్‌పై అమెరికా చేస్తోన్న ’ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి ఈ నౌక మద్దతు ఇస్తూనే ఉందంటూ ఇరాన్ ప్రకటనలను ఖండించింది. ఈమేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ’ఎక్స’ వేదికగా పోస్టు పెట్టింది. అమెరికా విÖడియా కథనాల ప్రకారం.. అబ్రహం లింకన్‌కు అతిదగ్గరగా ఓ ఇరాన్ పడవ వచ్చింది. దానిని గుర్తించిన అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. అయితే ఈ ఘటనలో యూఎస్ నౌక దెబ్బతిన్నదా, లేదా అని మాత్రం పేర్కొనలేదు. ఇక, ఇరాన్‌తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ట్రంప్ సేనలు దీనిని దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించాయి. ఇందులో ఎనిమిది స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉంటాయి. అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. యుద్ధం ప్రారంభమైన మూడు రోజుల తర్వాత నాలుగు క్షిపణులతో దాడి చేశామని చేసిన ప్రకటన కలకలం సష్టించింది. అయితే ఆ ప్రకటనలో నిజం లేదని అప్ప్పుడు కూడా అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్ వద్ద భారీస్థాయిలో హైపర్‌సోనిక్, నౌకా విధ్వంసక క్షిపణులు ఉన్నప్పటికీ అవి అమెరికన్ విమాన వాహక నౌకను తాకడం దాదాపుగా అసాధ్యమనే చెబుతుంటారు. విమాన వాహక నౌక ప్రధాన బలం దాని విÖద ఉండే యుద్ధ విమానాలే. యూఎసఎస్ అబ్రహం లింకన్‌పై ఎఫ్/ఏ`18 సూపర్ హార్నెట్, ఎఫ్`35సి స్టెల్త్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు సహా అనేక విమానాలు ఉన్నాయి. ఇవి శత్రువుపై దాడి చేయడంతోపాటు విమాన వాహకనౌకను రక్షించే సామర్థ్యాన్ని కలిగిఉన్నాయి. పోరు సమయంలో విమాన వాహక నౌక సాగరంలో స్థిరంగా ఉండదు. గంటకు 60 కిలోవిÖటర్ల వేగంతో కదులుతుంటుంది. రియల్‌టైమ్ ఉపగ్రహ నెట్‌వర్క్ లేకుండా దీని జాడను ఎప్పటికప్ప్పుడు పసిగట్టడం కష్టం. యూఎసఎస్ అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో.. ఇరాన్ తీరానికి దూరంలో వ్యూహాత్మక ప్రదేశంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ సవిÖపంలో మోహరించిన అమెరికా విమాన వాహక నౌక యూఎసఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ‘జెరాల్డ్‌లోని లాండ్రీ ప్రదేశాల్లో ఈ మంటలు చెలరేగాయి. అయితే అందుకు యుద్ధం కారణం కాదు. ఆ మంటలను ఆర్పేశాం. నౌకలోని ప్రొపల్షన్ ప్లాంట్‌కు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. గాయపడిన ఇద్దరు నావికులకు చికిత్స అందుతోంది. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నౌక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఎర్రసముద్రంలో తన సహకారాన్ని కొనసాగిస్తోందని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
కూలిన అమెరికా ఈఫ్యూయలింగ్ విమానం
అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ`135 ట్యాంకర్ ఉత్తర ఇరాక్‌లో గురువారం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారో అమెరికా అధికారులు ప్రకటించలేదు. సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. రెండు సైనిక ట్యాంకర్ విమానాలు ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. రెండో విమానం సురక్షితంగా దిగినట్లు పేర్కొంది. మరోవైపు ఇరాక్‌కు చెందిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ తామే అమెరికా విమానాన్ని కూల్చేసినట్లు ప్రకటించింది. ఈ గ్రూప్ ఇరాన్‌కు అనుకూలంగా పనిచేస్తోంది. ఆ సంస్థ అధికారిక టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. శత్రువుల దాడి లేదా ఫ్రెండ్లీ ఫైర్‌లో ఇది కూలిపోలేదని వెల్లడించింది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు ఇరాన్ విÖడియా చెబుతోంది. కేసీ`135 స్టాట్రోట్యాంకర్‌లో కనీసం ముగ్గురు సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. వీరిలో పైలట్, కోపైలట్, ఆపరేటర్ ఉంటారు. వీరితోపాటు నేవిగేటర్, మిషన్ ఆధారంగా అదనపు సిబ్బందిని తరలిస్తుంటారు. ఇరాన్ యుద్ధంలో తీవ్రమైన పనిఒత్తిడి ఉన్న కార్యక్రమం విమానాలకు గాల్లో ఇంధనం నింపడమే. వందల సంఖ్యలో అమెరికా, ఇజ్రాయెల్ విమానాలు దాడులకు వెళుతుండటంతో ట్యాంకర్ విమానాల అవసరాలు గణనీయంగా పెరిగాయి.
టెహ్రాన్‌లో భారీ పేలుడు..
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు సంభవించింది. అమెరికా`ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా టెహ్రాన్ స్క్వేర్‌లో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అక్కడి అధికారిక విÖడియా వెల్లడించింది. ఇరాన్‌లోని మరో నగరం ఖజ్విన్‌లోనూ భారీ పేలుడు సంభవించింది. ఈ దాడులు ఎవరు చేశారనే విషయం తెలియరాలేదు. అయితే, ఖజ్విన్, టెహ్రాన్‌లో పేలుళ్లు జరుపుతామని ఇజ్రాయెల్ ముందే హెచ్చరించింది. మరోవైపు.. దాడులు జరుగుతున్నప్పటికీ వేలాది మంది పౌరులు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటం గమనార్హం.ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. మతి చెడిన నేతలకు ఇవాళ ఏం జరుగుతుందో విÖరే చూస్తారని అన్నారు. “ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగయ్యింది. వైమానిక దళం కూడా ఇక ఉండదు. క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. వారి నాయకులు తుడిచిపెట్టుకు పోయారు. 47 ఏళ్లుగా అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా వారిని అంతం చేస్తున్నా” అని సోషల్ విÖడియాలో ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇరాన్ త్వరలో లొంగిపోనుందని ఇటీవల జరిగిన జీ7 నేతల వర్చువల్ సమావేశంలో ట్రంప్ పేర్కొన్నట్లు యాక్సియోస్ వార్తా సంస్థ కథనం వెల్లడించింది.
నలుగురు అమెరికా సైనికులు మతి..
ఇక, అమెరికాకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ`135 ట్యాంకర్ ఉత్తర ఇరాక్‌లో కుప్పకూలిన ఘటనలో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బంది ఉండగా.. అందులో నలుగురు చనిపోయినట్లు పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, ఘటనకు దారితీసిన పరిస్థితులపైనా దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.
ఒమన్‌లో డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయులు మతి, 10 మందికి గాయాలు
ఒమన్‌లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి గాయాలు కాగా.. వీరిలో 10 మంది భారతీయులేనని సమాచారం. ఐదుగురు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని భారత విదేశాంగ వెల్లడించింది. వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పేర్కొంది. మిగతా బాధితులు డిశ్చార్జి అయినట్లు తెలిపింది. సంబంధిత కంపెనీతోపాటు స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని, వారికి అవసరమైన సాయం అందిస్తున్నామని తెలిపింది.యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమాసియా నుంచి 1.50లక్షల మంది స్వదేశానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి (గల్ఫ్ విభాగం) అసీం మహాజన్ వెల్లడించారు. డ్రోన్ దాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఆయన తెలపలేదు. ఒమన్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. సోహార్‌లో రెండు డ్రోన్ దాడులు జరిగాయి. ఇందులో ఒకటి అల్ అవీ ఇండస్టియల్ జోన్‌ను తాకింది. ఇక్కడ పనిచేసే ప్రవాసుల్లో ఇద్దరు మతిచెందినట్లు పేర్కొంది. తాజా ఘటనతో పశ్చిమాసియా ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య ఐదుకి చేరినట్లయ్యింది. అయితే, ఒమన్‌లో మాత్రం ఇదే తొలిసారి. అంతకుముందు మర్చంట్ నౌకల్లో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

 

మా ఎల్పీజీ ట్యాంకర్టలకు హర్మూజ్ దాటేందుకు అనుమత్వివండి
` ఇరాన్‌తో భారత్ చర్చలు
` భారత్ మా మిత్రదేశం
` అందుకే సురక్షిత మార్గం కల్పిస్తున్నాం: ఇరాన్ రాయబారి
` రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్‌కు అమెరికా వాణిజ్య శాఖ అనుమతి
న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశంలో వంటగ్యాస్ కొరతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. వంటగ్యాస్ లభ్యతను పెంచేందుకు భారత్‌కు రావాల్సిన ఎల్పీజీ ట్యాంకర్ల కోసం ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయవిÖడియా కథనాలు వెల్లడించాయి.భారత్‌కు పయనమైన 8 ఎల్పీజీ ట్యాంకర్లు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయాయి. వీటిని సురక్షితంగా జలసంధిని దాటించేందుకు భారత ప్రభుత్వం ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందుకు ఇరాన్ అధికారులు సానుకూలంగానే స్పందిస్తున్నారని, త్వరలోనే ఆ ట్యాంకర్లు హర్మూజ్‌ను దాటే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు, ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ జ్వాలల నుంచి రెండు చమురు నౌకలు చాకచక్యంగా బయటపడ్డాయి. ఇందులో ఒకటి బుధవారం భారత్‌కు చేరుకోగా.. మరొకటి రెండ్రోజుల్లో రానుంది. ఈ రెండింటి ద్వారా 3 మిలియన్ బ్యారెళ్ల చమురు అందుబాటులోకి రానుంది.
కేరళలో 40శాతం హోటళ్లు బంద్
ఇదిలాఉండగా.. దేశంలో వంటగ్యాస్ కొరత ఆందోళనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో వాణిజ్య సిలిండర్లు (ఒఖఉ అyశ్రీతినిటవతీబ) దొరకట్లేదు. దీంతో హోటళ్లు, రెస్టారంట్లు, హాస్టళ్ల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. కేరళలో శుక్రవారం నాటికి 40శాతం రెస్టారంట్లు పనిచేయడం లేదు. ప్రత్యామ్నాయ కుకింగ్‌కు అవకాశం లేకపోవడంతో తాము వ్యాపారం నిలిపివేస్తున్నామని ఆయా రెస్టారంట్ల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం ప్రకటించినప్పటికీ.. కొన్ని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలు, పెట్రోల్ బంకుల బయట ప్రజలు బారులు తీరడం ఆందోళన కలిగిస్తోంది.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు
ఇరాన్ ` ఇజ్రాయెల్, అమెరికాల ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్ర ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రపంచ దేశాలకు కాస్త ఉపశమనం లభించింది. రష్యా చమురు కొనుగోలుకు స్వల్పకాలికంగా అనుమతినిస్తూ అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది. సముద్రంలో నిలిచిపోయిన చమురును కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ 11 వరకు అవకాశం కల్పించింది. ఇరాన్ ` ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్న తరణంలో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో స్థిరత్వాన్ని తీసుకు రావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ’ఎక్స’ వేదికగా వెల్లడించారు. ’ప్రపంచ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని పెంపొందించడం, ధరలను అదుపులో ఉంచేందుకే ట్రంప్ ఈ నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి సముద్రంలో నిలిచిపోయిన చమురు రవాణాకు మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయి’ అని బెసెంట్ స్పష్టం చేశారు. రష్యాపై ఆంక్షలు అమల్లో ఉన్నప్పటి కీ అమెరికా తాత్కాలిక సడలింపులతో పుతిన్ ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని బెసెంట్ అన్నారు. రష్యాకు వచ్చే ఆదాయంలో అధిక భాగం చమురు వెలికితీసే సమయంలోనే పన్నుల రూపంలో అందుతుందని, ఇప్ప్పుడు రవాణాలో ఉన్న చమురు అమ్మకం వల్ల వారికి అదనపు ప్రయోజనమేవిÖ ఉండదని ఆయన వివరించారు. ఈ నిర్ణయం వల్ల స్వల్పకాలికంగా ధరలు పెరిగినా.. దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో మేలుచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. తాజా సడలింపులతో మార్చి 12 నాటికి నౌకల్లో లోడ్ అయిన రష్యా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను ఏప్రిల్ 11 వరకు విక్రయించుకోవచ్చు. గతంలో అమెరికా ఆంక్షలు విధించిన రష్యన్ సంస్థల నుంచి ఉత్పతెí్తన చమురును కూడా ఇప్ప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు. ఇకపోతే ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇరాన్ ఉపశమనం కలిగించింది. భారతీయ ట్యాంకర్లను హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య జరిగిన చర్చల అనంతరం.. భారత జెండాలు కలిగిన నౌకలకు టెహ్రాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పలు విÖడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామంతో అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కుంటున్నప్పటికీ.. పుష్పక్, పరిమళ్ అనే రెండు భారతీయ ట్యాంకర్లు వ్యూహాత్మకంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్టు పేర్కొన్నాయి.అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు సంబంధంలేని నౌకలకు మాత్రం ఆంక్షల నుంచి సడలింపునిచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా భారతీయ నౌకలు జలమార్గం గుండా సురక్షితంగా ప్రయాణించడం విశేషం.

 

త్వరలోనే ఇరాన్ లొంగిపోతుంది
` యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
` మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు
` గుర్తుపట్టలేని విధంగా మారినట్లు భావిస్తున్నాం
` అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు
టెహ్రాన్(జనంసాక్షి):దాదాపు రెండు వారాలుగా కొనసాగుతున్న ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్? త్వరలోనే లొంగిపోతుందని పేర్కొన్నారు. రెండ్రోజుల క్రితం జీ7 నేతల వర్చువల్ భేటీలో ట్రంప్ పేర్కొన్నట్లు ఓ వార్త సంస్థ తెలిపింది. అమెరికా`ఇజ్రాయెల్ దాడులకు ప్రతికారం తీర్చుకుంటామని, వారికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగించాలని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ వ్యాఖ్యలకు ముందు ట్రంప్ చేపినట్లు తెలిపింది.ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడుల డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. మతిచెడిన ఉన్మాదులకు ఇవాళ ఏం జరుగుతుందో చూడండని అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగయ్యిందని, వైమానికదళం కూడా ఇక లేదని తెలిపారు. ఇరాన్ నాయకులు భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోయారని పేర్కొన్నారు. వారి క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని పేర్కొన్నారు. 47 ఏళ్లుగా ఇరాన్ నేతలు అమాయకులను పొట్టనపెట్టుకున్నారన్నారని తెలిపారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా వారిని అంతం చేయడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.
మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు
అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, గుర్తుపట్టలేని విధంగా మారినట్లు భావిస్తున్నామన్నారు. అయితే, వీటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించలేదు. పెంటగాన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అంతం చేయడంపైనే అధ్యక్షుడు ట్రంప్ దష్టి పెట్టారని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమం ముగింపే తమ ప్రధాన లక్ష్యమని అమెరికా రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇప్పటివరకు 15వేల లక్ష్యాలపై దాడులు చేశామన్నారు. మిగతా అన్ని స్థావరాలను ధ్వంసం చేయాలని యోచిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో దాడులు మరింత తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రాథమిక పాఠశాలపై ఎలా దాడి జరిగిందని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేసిన పీట్ హెగ్సెత్.. అమెరికా ఎన్నడూ పౌరులను లక్ష్యంగా చేసుకోదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్‌తో సంబంధం లేని ఓ అధికారిని నియమించామన్నారు. వాస్తవాలను తెలుసుకున్న తర్వాత.. ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.