టిడిపి నేతల్లో హిందూపురం జ్వాలలు

అనంతపురం,నవంబర్‌22: హిందూపురం టిడిపి రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి  సినీనటుడు బాలకృష్ణ ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు పోటీచేస్తారన్న వార్త స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. ఇంతకాలం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా ఉంది. మరోవైపు ద్వితీయశ్రేణి నాయకత్వం మాత్రం బాలయ్య రావాలని కోరుకుంటున్నారు. కవేళ అదే జరిగితే ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో ముఖ్య నాయకులుగా చలామణి అవుతున్న వారి భవితవ్యం ఏమిటనే చర్చ జరుగుతోంది. బాలయ్య అభ్యర్థిత్వంపై బహిరంగంగా సంతృప్తి, సానుకూలత వ్యక్తం చేస్తున్నప్పటికీ… అంతర్గతంగా తమ పరిస్థితి ఏమిటని లోలోన మధనపడుతున్నట్లు- సమాచారం.హిందూపురం పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప మరోసారి అదే స్థానం దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. తాజాగా ఇక్కడి నుంచి బాలయ్య పోటీ- చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నందున అదే జరిగితే నిమ్మలను ఎక్కడి నుంచి పోటీ-కి దింపుతారోననే సందేహం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పెనుకొండ నియోజక వర్గం నుంచి పోటీ- చేసేందుకు గతంలో నిమ్మలతో పాటు- పరిటాల సునీత కూడా సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే సవిూకరణల నేపథ్యంలో పార్థసారథికి ఆ స్థానం కేటాయించి అందరినీ సర్దుబాటు- చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పురం నుంచి బాలకృష్ణ పోటీ- అనివార్యమైతే.. సవిూపంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి నిమ్మలకు పోటీ- చేయించే అవకాశం కల్పిస్తే… తమ పరిస్థితేమిటని హిందూపురం, పుట్టపర్తి ఎమ్మెల్యేలు అబ్దుల్‌ఘని, పల్లెరఘు నాథరెడ్డి ఆలోచనలో పడినట్లు- తెలుస్తోంది. హిందూపురం నుంచి బాలయ్య పోటీ- అనివార్యమైతే… ఆ ప్రాంత సవిూప నియోజకవర్గాల ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి టిక్కెట్లు దక్కడం కష్టమనే సందేహాలు ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులు ఏర్పడితే తమ భవితవ్యం ఎలా ఉంటు-ందోనని ముఖ్య నాయకులు ఆందోళన చెందుతున్నట్లు- సమాచారం. పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపూర్‌లో  వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు రాజకీయ విజయం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అంతటి ఆదరణ ఉన్న హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి ఆయన తనయుడు బాలకృష్ణ పోటీ- చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ పార్టీ ముఖ్యనేతలు పురం నుంచి బాలకృష్ణను బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఈ విషయంపై లోతుగా చర్చ జరిగినట్లు సమాచారం. అందుకే  ముఖ్య నాయకులు మాత్రం ఆచితూచి మాట్లాడాలనే యోచనలో ఉన్నట్లు- తెలుస్తోంది. అయితే ఇందుకు స్పందనగా ఎలాంటి వాఖ్యలూ చేసేందుకు నాయకులెవరూ ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష ¬దాకే పరిమితమయింది. 2004, 2009 ఎన్నికల్లో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే అనంతపురం జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు దక్కాయి. పైగా హిందూపురం పార్లమెంటు- పరిధిలో పార్టీకి ఢోకాలేదన్నట్లు- విజయాలు నమోదయ్యాయి. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉండే విధంగా హిందూపురం ఎంపీతో సహా ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ అంకిత భావంతో పనిచే స్తున్నారు. ఇటీవలి కాలంలో పార్టీ కీలక భేటీలు, ఉద్యమాల్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల భాగస్వామ్యముంది. ఇలా పార్టీ నేతలు చంద్రబాబు నాయుడుతో కలిసి పలు కీలక సమయాల్లో నడుచుకుంటున్నందున ఆ చనువుతో మరోసారి ఎన్నికల్లో కూడా తమకే టిక్కెట్లు  దక్కుతాయనే ధీమాతో ఉన్నారు.