టీఆర్‌ఎస్‌ అవిశ్వాసానికి

మా మద్దతు లేదు : చంద్రబాబు
ఏలూరు,మార్చి13(జనంసాక్షి): అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసని, తమ వ్యూహం తమకుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరి ఒత్తిల్లకో లేదా కాంగ్రెస్‌తో లాలూచీ పడడమో టిడిపికి అవసరం లేదన్నారు. సూట్‌కేసులతో ఎమ్మెల్యేలను కొన్న వారికి తాము మద్దతివ్వాలా అని ప్రశ్నించారు. మనుషులను కొని రాజకీయాలు చేయడం నీతి మాలిన చర్యగా బాబు అభివర్ణించారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడాల్సిన ఖర్మ లేదని, తనపై ఏమాన్న కేసులున్నాయా, తన ఇంటి అనుమతులు కావాలా వైసీపీపై పరోక్ష విమర్శలు చేశారు.అవిశ్వాసం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజా అవసారల కోసం కాదని చంద్రబా బునాయుడు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర సమితి  ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తోక పార్టీలు ప్రతిపాదించే తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని ఆయన అన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రతిపాదించాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సిన అవసరం తమకు లేదని, అవినీతి ప్రభుత్వానికి ప్రజాకోర్జులోనే బుద్ధి చెప్తామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లను పిలిచే అర్హత ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. డబ్బులు ఆశ చూపి శానససభ్యులను కొంటున్నారని ఆయన ఆరోపించారు. తెరాస బ్లాక్‌ మెయిల్‌ కోసం, వైయస్సార్‌ కాంగ్రెసు లాలూచీ కోసం అవిశ్వాస తీర్మానాన్ని తెర విూదికి తెచ్చాయని ఆయన విమర్శించారు. ఆ పార్టీలకు కావాల్సింది ప్రజా ప్రయోజనాలు కాదని, వ్యక్తిగత ప్రయోజనాలని ఆయన అన్నారు.గవర్నర్‌ ప్రసంగం అంతా తప్పుల తడకగా సాగిందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి వల్లే రాష్టాన్రికి పెట్టుబడులు రావడం లేదని ఆయన పశ్చిమగోదావరి జిల్లా పూలపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తాము చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్‌లో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరిగిందని పేర్కొన్నారు. రాష్టాన్న్రి నాలెడ్జ్‌ స్టేట్‌గా తయారు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి హావిూ పథకం అవినీతిమయమైందని ఆరోపించారు. చేనేత రంగాన్ని కాంగ్రెస్‌ పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. పావల వడ్డీ పేరుతో రూపాయి వసూలు చేస్తున్నారని రాష్ట్రంలో మహిళలు తిట్టుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు.అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగానికి దశాదిశా లేదని, ప్రసంగమంతా తప్పుల తడక అని  ఆరోపించారు.  కాంగ్రెస్‌ హయాంలో గవర్నర్‌కు ఇదే చివరి ప్రసంగం అని ఆయన అన్నారు. మూడున్నరేళ్లలో గవర్నర్‌ ప్రసంగంలో చెప్పినవేవి అమలుకాలేదని బాబు ఆగ్రహం వ్యక్తపరిచారు.పంటలకు మద్దతు ధరలేదు…సీఎం కిరణ్‌కుమార్‌కు అనుభవం లేదని బాబు ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో 11 స్థానానికి పడిపోయామని, అన్ని రంగాల్లో వెనుకబడి పోయామన్నారు. ప్రపంచం ఆశ్చర్య పోయేలా కాంగ్రెస్‌ వాళ్లు అవినీతికి పాల్పడ్డారని, రాష్టాన్న్రి ఈ స్థాయికి పతనం చేయడం కాంగ్రెస్‌కే సాధ్యమని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడ బాంబు పేలినా…దాని మూలం హైదరాబాద్‌లోనే ఉంటుదన్నారు. టీడీపీ హయాంలో రూ.50 వేల కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు లక్షా 73 వేల కోట్లకు చేర్చారన్నారు. ఉపాధి హావిూ పథకం ఓ అవినీతి పథకమని దుయ్యబట్టారు. కరెంట్‌ కోతలతో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన అన్నారు. పావలావడ్డీ ఓ ఫాల్స్‌ అని మహిళలు తిడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.అవిశ్వాసంపై బాబు మాట్లాడుతూ అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసని, తమ వ్యూహం తమకుందన్నారు. సూట్‌కేసులతో ఎమ్మెల్యేలను కొన్నవారికి తాము మద్దతివ్వాలా అని ప్రశ్నించారు. మనుషులను కొని రాజకీయాలు చేయడం నీతి మాలిన చర్యగా బాబు అభివర్ణించారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడాల్సిన ఖర్మ లేదని విమర్శలు చేశారు.అవిశ్వాసం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజా అవసారల కోసం కాదని చంద్రబాబునాయుడు అన్నారు. తెరాసపై తమకు నమ్మకం లేదని, అందుకే ఆ పార్టీ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వడం లేదని తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాదులో విూడియా ప్రతినిధులతో అన్నారు. కాగ్రెసుతో తెరాస కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. ప్యాకేజీల కోసం ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని ఆయన అన్నారు.