టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు అలూర్‌ గంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొన్ని పెట్టుబడిదారుల కంపెనీల లాభాల కోసం పెట్రోల్‌ ధరలను పెంచారని ఆయన విమర్శించారు. రాత్రికిరాత్రి పెద్దఎత్తున రూ.7.50 పైసలు పెంచడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ పోశెట్టి, విఠల్‌, శ్రీనివాస్‌, సుజిత్‌సింగ్‌ ఠాకూర్‌, టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.