టీఆర్‌ఎస్‌ విద్యార్థి యువత ఆధ్వర్యంలో రాస్తారోకో

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):పట్టణంలోని కమాన్‌ వద్ద టీఆర్‌ఎస్‌ విద్యార్థి యువత ఆధ్వర్యంలో రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో కార్య క్రమం నిర్వహించారు.ఈ సంధర్భంగా నాయకులు ఉప్పు రాజుకుమార్‌ మాట్లాడుతు ఈ నెల23న వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటన రద్దు చేసుకోవాలని లేదంటే తెలంగాణ మొత్తం అగ్ని గుండంగా తయా రవుతుందని అన్నారు.వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు తెలంగాణలో అడుగు పెట్టాలంటే పాస్‌ పోర్ట్‌ తీసుకుని రావాలన్నారు.కనుక విజయమ్మ పాస్‌పోర్ట్‌ తీసుకుని రావాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో పడాల సతీష్‌ గౌడ్‌, కొలిపాకశ్రీనివాస్‌,అజ్జు,కుమార్‌,రాకేష్‌,శిరీష్‌,చిన్న,కుమార్‌ యాదవ్‌, ఎరుకల రమేష్‌,దర్మపురితో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.