టీచర్‌ వేధింపులు తాళలేక విద్యార్ధిని ఆత్మహత్య

కరీంనగర్‌: జిల్లాలోని సైదాపూర్‌ మండలం గొల్లగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సంధ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. టీచర్‌ వేధింపులు తాళలేకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు, విద్యార్ధిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరుకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు