టీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: నాచారంలోని నోమా ఫంక్షన్‌ హాలులో తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం  ప్రారంభమైంది. ఈ సమావేశం జేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరాం అధ్యక్షతన జరుగుతోంది. భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ, మెడికల్‌ సీట్ల కేటాయింపు, కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.