టీ 20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం

కొలంబో: టీ 20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ పరాజయం పాలైంది. భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా పాకిస్థాన్‌ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ జట్టులో కమ్రాన్‌ అక్మల్‌ 92, మాలిక్‌ 37 పరుగులతో నటౌట్‌గా నిలిచారు. బౌలింగ్‌ చేసిన భారత్‌ జట్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ 4 వికెట్లు తీశాడు.