డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లక్కీ డ్రాలో లొల్లి
*భూమిని కోల్పోయిన భూ నిర్వాసితులకు అన్యాయం*
మంత్రి హరీష్ రావు సమక్షంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 1:: తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు చేస్తామని లబ్ధిదారులందరూ రావాలని లక్ష్మి గార్డెన్లో ఏర్పాటుచేసిన సమావేశం రసాభాసగా మారింది రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి గడ అధికారి ముత్యంరెడ్డి తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ కౌన్సిలర్లు సమక్షంలో 472 ఇండ్లు ప్రస్తుతం పూర్తయ్యాయని వాటిలో 240 మాత్రమే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో ఇస్తారని ఇది పేదలకు కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు డ్రా తీసిన తర్వాత అసలైన లబ్ధిదారులు గాక ఇతరులకు లబ్ధిదారులకు ఇల్లు కేటాయించడంతో అక్కడికి వచ్చిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు లకు ఇల్లు కేటాయికపోవడంతో వారు ఆగ్రహంతో శాపనార్థాలు పెట్టారు నాయకుల ముందే వారు ఆగ్రహంతో తిట్టడంతో అధికారులు హడావుడిగా వెళ్లిపోయారు
డబ్బులు బెడ్ రూమ్ లబ్ధిదారుల యొక్క పేర్లను లక్కీ డ్రా పేరుతో తీయడం జరిగింది. సరైన లబ్ధిదారులు పేర్లు రాలేవని మహిళలు నిరసన తెలియజేశారు. ముఖ్యంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితి కొట్టొచినట్టు కనబదింది. భూమిని కోల్పోయిన భూనిర్వాసితులు స్టేజి ముందర ఆందోళన వ్యక్తం చేశారు రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారు నిరసన వ్యక్తం చేశారు 240 మంది లబ్ధిదారుల పేర్లను లక్కీ డ్రా పేరుతో తీశారు. శుక్రవారం జరిగే డబుల్ బెడ్ రూమ్ ఇలా ప్రారంభోత్సవానికి రాశారు వస్తున్నట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు