డిజే యజమానులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం
బోయిన్ పల్లి ఆగస్టు 30 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం లో మంగళ వారం రోజున బోయిన్ పల్లి ఎస్ ఐ అభిలాష్ అధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో
డిజే యజమానులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి, రాత్రి 10 గంటల తర్వాత డీజే సౌండ్‌లు సౌండ్ సిస్టమ్‌లను ఉపయోగించకూడదని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు
. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉత్సవ కమిటీ నిర్వాహకులు డీజే యజమానులు పాల్గొన్నారు