డివైడర్‌ను ఢీకొన్న పాఠశాల బస్సు.. విద్యార్థులకు గాయాలు

ఒంగోలు: నగరంలోని మంగమ్మ కళాశాల వద్ద పాఠశాల బస్సు ప్రమాదానికిగురైంది. వెంకటేశ్వర నగర వద్ద అదుపు తప్పి బస్సు డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పలువురి విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.