డిసెంబరు ఒకటిన తెలంగాణ ఐకాస సమావేశం
హైదరాబాద్: డిసెంబరె 1న ఉదయం పది గంటలకు నోమా ఫంక్షన్ హాల్లో ఐకాస విస్తృత స్థాయి సమావేశం జనపనున్నట్లు తెలంగాణ ఐకాస కన్వీనర్ కోదండరామ్ తెలిపారు. తెలంగాణ విషయంలో కేంద్రం మోసపూరితంగా వ్వవహరిస్తోందని ఆయన అన్నారు. డిసెంబరు 22న ధూమ్‌ధామ్ శతాబ్ది ఉత్సవాలకు, డిసెంబరు 29న తెరాస దీక్షా దివన్కు ఐకాస మద్దతిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఎంపీలు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు కదలాలని ఆయన సూచించారు.



