‘డీఎస్సీలోనూ తెలంగాణవారికి అన్యాయం’

హైదరాబాద్‌: ప్రతీ డీఎస్సీలోనూ తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతూనే ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో సీమాంధ్రకు చెందిన అభ్యర్థులను తెలంగాణలో పాగా వేస్తున్నారని, తెలంగాణ అభ్యర్థులకు రావాల్సిన ఉద్యోగ కోటాలో వచ్చి చేరుతున్నారని ఆయన ఆరోపించారు.