డీఎస్సీ 2012 షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: డీఎస్సీ 2012  నియామక షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 26న మెరిట్‌లిస్ట్‌ విడుదల కానుంది. డిసెంబరు 1న ప్రొవిజనల్‌ లిస్ట్‌ను ప్రకటించనున్నారు. డిసెంబరు 3 నుంచి 5వరకు ఉద్యోగాల వారీగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలంచనున్నారు. డిసెంబరు 15న అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేస్తారు. డిసెంబరు 16,17 తేదీల్లో పోస్టుల వారీగా నియామకాలు చేపట్టనున్నారు.