డీసీఎంని ఢీకొన్న ఆటో: ముగ్గురు మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా లోని న్యాల్‌కల్‌ మండలం హద్నూర్‌ శివారులో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రయాదంలో ముగ్గురు మృతి చెందగా, మరోముగ్గురు గాయాలయ్యాయి. హద్నూరు నుంచి ముంగి వైపునకు వెళుతున్న ఆటోను డీసీఎం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.