డోర్నకల్‌లో 8.5 కేజీల గంజాయి పట్టివేత
డోర్నకల్, ఫిబ్రవరి 15 జనంసాక్షి : హజ్రత్ నిజామోద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి వరంగల్ జిల్లా డోర్నకల్‌లో జీఆర్పీ పోలీసులు నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి నుంచి 8.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్లో ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న ఖమ్మం జీఆర్పీ పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని, బెర్తులపై ఉన్న బ్యాగులను పరిశీలించారు. బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన బ్యాగుల్లోని గంజాయి బయటపడటంతో నిందితుడు పరారయ్యాడు. అతడు పరుగెత్తుత్ను క్రమంలో జేబులో నుంచి రెండు సెల్‌ఫోన్‌లు, పాస్‌పోర్టు, వీసా జిరాక్స్ కిందపడి పోయాయి. పాస్‌పోర్టు ఆధారంగా సదరు నిందితుడిని నైజీరియాకు చెందిన మూడుకు ఉక్యఅలైక్‌గా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.లక్షకుపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. పరారైన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వివరించారు.