ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన జగన్.. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరి మధ్య భేటీ సుమారు అరగంట పాటు కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం, పెండింగ్ అంశాలపై ప్రధానికి జగన్ వినతిపత్రం అందజేశారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం జగన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవ్వనున్నారు. మంగళవారం ఉదయం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. కాగా.. తొలుత సీఎం జగన్ ఢిల్లీ చేరుకోగా వైసీపీ ఎంపీలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.