తమిళ సంఘసేవకుడికి రామన్ మెగసెసె అవార్డు
చెన్నై : ఈ ఏడాది రామన్ మెగసెసె అవార్డు విజేతలు ఆరుగురిలో ఒకరు భారతీయులు. చెన్నైకి చెందన కులందై ఫ్రాన్సిస్(66) 2012 రామన్ మెగసెసె అవార్డుకి ఎంపికైనట్లు నిర్వాహకులు నిన్న మనీలాలో ప్రకటించారు. తైవాన్, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియాలకు చెందిన మరో ఐదుగురు కూడా ఈ ఏడాది మెగసెసె విజేతల్లో ఉన్నారు. విజేతలందరికి వచ్చే ఆగస్టు 31న మనీలాలో ఒక కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు.