తహసిల్దార్ కు వినతి పత్రము.

మర్పల్లి, సెప్టెంబర్ 01(జనంసాక్షి) కొత్త పింఛన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని పి ఆర్ టి యు మండల ప్రధాన కార్యదర్శి నీలకంఠం అన్నారు. రాష్ట్ర టి అర్ టి యు పిలుపుమేరకు మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మర్పల్లి మండల తహసిల్దార్ శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్దించాలని వారు అన్నారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీశైలం సార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు హరికృష్ణ , రాజేందర్, జిల్లా బాధ్యులు సంగమేశ్వర్, రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీనివాస్లు ఉన్నారు.