తిమ్మాపూర్‌లో రైతు చైతన్య యాత్ర

బీర్కూర్‌, మే 26 (జనంసాక్షి): మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో శనివారం ఉదయం అధికారులు రైతుచైతన్య యాత్రలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఖరీఫ్‌ పంటలను దృష్టిలో ఉంచుకొని రసాయనిక ఎరువులను వాడకం, ఆరుతడి పంటల అవగాహన, పంట మార్పిడి విధానం, వ్యవసాయ అనుబంధ పథకాల గురించి రైతులకు వివరించినట్లు వ్యవసాయాధికారిణి కమల తెలిపారు. సమా వేశంలో తమకు జిలగ విత్తనాలు సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో శ్రావణ్‌, విఆర్వో దిగంబర్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.