తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ను తయారు చేయాలని కేసీఆర్‌ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్‌ఆర్‌ పార్టీలకు తెలంగాణలో చోటు లేకుండా పార్టీ కార్యకర్తల పని తీరు ఉండాలని ఆయన సూచించారు. పార్టీ కోసం పని చేయని ఇన్‌ఛార్జీలను మారుస్తామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన డిసెంబర్‌ 9న తెలంగాణ స్ఫూర్తిదివస్‌గా ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.